Sunday, May 31, 2009

మన్నించండి మాస్టారు


అవి నేను కరాటే నేర్చుకునే రోజులు .బ్లాకు బెల్ట్ కోసం నిరంతరం శ్రమిస్తూ ప్రాక్టీసు కోసం మాస్టారి ఇన్స్టిట్యూట్ లోనే ఎక్కువ సేపు వుండే దాన్ని .ఆ రోజు అప్పటికే సాయంత్రం 6. 30 అయ్యింది . మిగతా స్టూడెంట్స్ ఎప్పుడో వెళ్లి పోయారు .నేను మాస్టర్ వున్నాం. అంతలో కరెంటు పోయింది . మాస్టారు candle కొని తీసుకు రావడానికి బయటకు వెళ్లారు, చుట్టూ చిమ్మ చీకటి .కన్ను పొడుచుకున్నా కనబడని పరిస్తితి.నాకు అసలు భయం అంటే ఏమిటో తెలిదు కానీ ఎందుకో వెన్నులో జలదరింపు, అది భయం తో వచ్చింది కాదు ఎవరో నా నడుము మీద చెయ్యి వేసి నొక్కు తున్నారు . నేను అసలే మంచి వొడ్డు, పొడుగు దానికి తగ్గ అవయవ సౌవస్తావాలతో చాల అందం గా వుంటానని అందరూ అంటుంటే మా మమ్మీ డాడీ అందుకే కరాటే నేర్చుకో అని పొర బట్టి బ్లాక్బెల్ట్ స్తయిదాకా వచ్చా .ఆ చెయ్యి ఇంక పైకి పాకుతూ వేటి కోసమో ఆత్రం గా ఆరాట పడడం గమనించ. యి లోపు వెచ్చటి వూపిరి నా మెడ మీద తగలడం తో కధ పూర్తీ గా అర్ధం అయ్యింది, వెంటనే మా మాస్టార్ని తల్చుకుని ఒక్క గ్రోయిన్ పంచ్ మోచేత్తో వెనకనుంచి ఇచ్చి వెంటనే ఇంటికి వెళ్లి పోయా. ఆ రాత్రంతా నాకు నిద్ర పట్టక పోడానికి కారణం ఒక మగాడి స్పర్శ జీవితం లో మొదటి సారి తగలడమే లాంటి కుళ్ళు సినిమా జోకులు పక్కన బెడితే , నాకున్న కరాటే అనుభవం లో ఆ మనిషి బతికి బట్ట కట్టడం అసంభవం . అంటే ఆత్మా రక్శనర్దమ్ అప్పుడే మొదటి హత్య బోణి అయిపోయిందేమో అన్న దిగులే ఆ నిద్రలేమి కి కారణం.సరే ఎప్పుడెప్పుడు తెల్లరుతుందా మాస్టర్ కి యి విషయం ఎలా చెప్పాలా అని మదన పడుతూ పొద్దున్నే తొందర గా రెడీ అయ్యి మాస్టర్ ఇంటికి వెళ్ళ. ఇంటిముందు షామియానా , కుర్చీలు , నా మనసేదో కీడు సంకించిన్డి . దగ్గరికి వెళ్లి చుస్తే మాస్టారి శవం దాని మీద పూల దండ .మాస్టారు బ్రహ్మ చారి వెనక మునందు ఎవరు లేక పోవడం తో స్టూడెంట్స్ మాత్రమే వున్నారు . ఎలా జరిగింది ?గొంతు బొంగురు పోతుంటే ఇంకో స్టూడెంట్ ని అడిగా, తన ఇన్స్టిట్యూట్ లో ఎవరో అమ్మాయిని అఘాయిత్యం చెయ్య బోతే అడ్డుకున్నారట చీకటి లో గోడకి తల తగిలి , మరి ఈ విషయం నీకెలా తెలిసింది అడిగా ఆత్రం గా .ఆ టైం లో సెల్ మర్చి పొయి నేవెనక్కి ఇన్స్టిట్యూట్ కి వచ్చే టప్పటికి మాస్టారు కోన వూపిరి తో వుండి ఈ విషయం చెప్పి చని పోయారన్నాడు .అంటే నా వంటి మీద చెయ్యి వేసింది మాస్టర్ ఆ ?లేక సెల్ కోసం వెనక్కి వచ్చిన వీడా?వొక వేళ వీడు అయ్యి వుంటే వీడు పోవాలి గాని మాస్టర్ ఎలా ?లేక పొతే తన పరువు పోకుండా మాస్టర్ జీవిత చరమాంకం లో అలా కధ అల్లారా?చెయ్యి వేసింది మాస్టర్ అని తెలిసి వుంటే .................... ప్రోత్సహించేదన్నని అనుకోకండి అంతలా చచ్చేలా కిక్ ఇచ్చేదాన్ని కాదేమో కాసేపు సృహ కోల్పోయాల కొట్టి వెళ్లి పోయేదాన్ని . పాపం బ్రహ్మచారి మాస్టారు మన్నించండి అది మీరే అయిన కాక పోయిన నా వల్ల ,లేదా నాకోసం చని పోయారు కాబట్టి .

Tuesday, May 19, 2009

బ్లాగు లోకానికి వందనం

మంచు కొండలలో,టీ తోటలలో, తాకుతూ పోయే మబ్బులలో సీతాకోక చిలుకలా, అమాయక జింక పిల్లలా పెరిగి ఒక తెలుగు అమ్మాయిని. నా భావాలను మీతో పంచుకుందామని బ్లాగులోకి వచ్చాను. తెలుగు బ్లాగులు ఉన్నాయని ఇంత కాలం తెలియదు. పేరు చూసి భయపడకండి. జమ్మూ కాశ్మీర్ లో మా నాన్న గారు ఎక్కువ కాలం పనిచేసారు. అందుకని కాశ్మీర్ కలిసోచ్చేలా, నా అభిమాన రచయిత యండమూరి పేరు గుర్తొచ్చేలా ఈ పేరును ఎంచుకున్నాను. ఆడపిల్ల అంటే కాశ్మీరంలా ఉంటే మంచిదే. కాని ఈ రోజులలో కాష్మోరీ గా ఉంటేనే సమాజంలో ఆడపిల్లకు రక్షణ. కాదంటారా? కాదనర్లెండి. నన్ను ఆదరిస్తారు కదూ.